కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహశీల్దార్ కి వినతిపత్రం

గ్రామ పంచాయతీ కార్మికుల  జీతాలు తక్షణమే చెల్లించాలి 

గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్

06

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 10 :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం బుధవారం రోజు సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు మేరకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆత్మకూరు(ఎం)మండల సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ కి అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం మాటడుతూ కేంద్ర బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలంటే పోరాటాలను తీవ్రతరం చేయడం తప్ప మరో మార్గం లేదని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు, వారు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా  నేడు కార్మికుల కోర్కెల దినంగా పాటించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి అని, బొగ్గు గనులను వేలం వెయ్యడాన్ని నిలుపుదల చేసి సింగరేణికి నేరుగా గనులను కేటాయించాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26000 రూపాయలు నిర్ణయించాలని, పదవీ విరమణ పొందుతున్న అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు  పదవీ విరమణ నగదు మొత్తం గౌరవ ప్రదంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం సిఐటియు అండగా ఉంటుందని పోరాటాలు చేస్తేనే హక్కులు సాధించుకోగలుగుతామని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల మండల గౌరవ అధ్యక్షులు నోముల స్వామి మాట్లాడుతూ  పొద్దనక రాత్రి అనక , ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని, నాయకుడు అధికారి అని తేడా లేకుండా ఎవరు చెప్పిన గ్రామ అభివృద్ధిలో పారిశుధ్య కార్మికులుగా భాగస్వాములు అయితే ప్రభుత్వాలు  మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఒక్కొక్క గ్రామ పంచాయతీలో నెలల కొద్దిగా వేతనాలు ఇవ్వడం లేదని పని ఒత్తిడి పెరుగుతుంది కానీ తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని తక్షణమే ప్రభుత్వం మా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అర్ధం చేసుకొని కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని లేని యెడల గ్రామ పంచాయతీ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళనకు దిగుతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ పంచాయతీల ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు కూరెల్ల కిష్టయ్య, ఉపాధ్యక్షులు రాగటి శ్రీను, కోశాధికారి సుదగాని రమేష్, కార్మిక సంఘం నాయకులు బెజ్జంకి నరసింహ చారి, సైదులు,కోల మచ్చగిరి, దేవరాజు రాజశేఖర్, వేముల రాములమ్మ, బట్టు బిక్షపతి, రామచంద్రు, కవిత, పద్మ, లక్ష్మి, మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Read More రద్దీ ఎక్కువ బస్సులు తక్కువ.!