బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టిన నూతి శ్రీకాంత్

సన్మానించిన గౌడ కంఠం పత్రిక ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్

05

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 11 :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలంలోని పల్లెర్ల గ్రామానికి చెందిన గౌడ కంఠమ్ జాతీయ మాస పత్రిక ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్ బీసీ కార్పోరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నూతి శ్రీకాంత్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా నోముల సిద్దూ గౌడ్ మాట్లాడుతూ బీసీ కార్పోరేషన్ ద్వారా బీసీలను ఆదుకోవాలని ప్రభుత్వ పథకాలల్లో బీసీలకు పెద్ద పీట వేయాలని కోరారు . బీసీలకు అండగా ఉండాలని అన్నారు .

Read More వివాదంలో డబల్ ఇస్మార్ట్ సాంగ్..పాటలో KCR డైలాగు ఉండడం పై BRS శ్రేణుల అభ్యంతరం