చేనేత కార్మికులకు అండగా ఉంటా-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కార్మికుల సమస్యలను అన్ని విధాల పరిష్కరిస్తా..
ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన చండూరు పట్టణ చేనేత కార్మికులు
చండూరు, విశ్వంభర :- చేనేత కార్మికుల సమస్యలను అన్ని విధాల పరిష్కారం అయ్యేలా చొరువ చూపిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు నేతృత్వంలో చండూరు చేనేత కార్మిక సంఘం, చేనేత పరిరక్షణ సేవా సమితి(సిపిఎస్) ఆధ్వర్యంలో పలువురు చండూరు పట్టణ చేనేత కార్మికులు శనివారం మునుగోడులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన కార్మికులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రిఫ్ట్ ఫండ్ కు సంబంధించి పెండింగ్ చెక్కులు వెంటనే విడుదల అయ్యేలా ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రితో మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు. చేనేత మిత్ర ద్వారా నెలకు 3,000 వచ్చేలా చూస్తానన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను ఒక్కోక్కటిగా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంతోనే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని గుర్తు చేశారు. వైఎస్ఆర్ హయాంలో 312 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేయించిన విషయం అందరికీ తెలుసు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు తిరందాసు శ్రీనివాసులు, చేనేత పరిరక్షణ సేవా సమితి(సిపిస్)అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్,కర్నాటి శ్రీనివాసులు,రాపోలు వెంకటేశం,రావిరాల శ్రీను, ఏలె శ్రీను,చెరుపల్లి కృష్ణ, ఏలే సుధాకర్, పున్న బిక్షమయ్య,ఏలే సత్తయ్య, రాపోలు లక్ష్మయ్య, ఏలె చంద్రశేఖర్, తిరందాసు దామోదర్, తిరందాసు ఆంజనేయులు, చిట్టిపోలు అంజయ్య, జూలూరు వెంకటేశం,రావిరాల రాజు, తిరందాసు నందు, గంజిబిక్షం, చెరుపల్లి రాము, తిరందాసు భాస్కర్, గానుగు వెంకటేశం, సంగెపు మల్లేశం, చెరుపల్లి శ్రీను, జూలూరు మల్లేష్,కర్నాటి శ్రీను చెరుపల్లి రాఘవేంద్ర, కర్నాటి వెంకటేశం, చెరుపల్లి రాజు, జెల్ల నాగరాజు, గుర్రం శేఖర్,చెరుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.