న్యూ పవర్ కుంఫు శిక్షణతోనే మానసిక, శరీర శక్తి సాధ్యం.

న్యూ పవర్ కుంఫు శిక్షణ పై యువత ఆసక్తి పెంపొందించుకోవాలి.

1000 పైగా అవార్డులను సొంతం చేసుకున్న ఘనత అహ్మద్ ఖాన్ బ్రూస్లీ మాస్టర్ ది.

WhatsApp Image 2024-07-05 at 1.09.24 PM

విశ్వంభర న్యూస్
షాద్ నగర్:మానసికంగా శారీరకంగా దృఢంగా మారాలంటే న్యూ పవర్ కుంఫు అకాడమి  శిక్షణతోనే సాధ్యమవుతుందని షాద్ నగర్ కుంఫు మస్టర్ నిర్వాహకుడు అహ్మద్ (బ్రూస్ లీ) అన్నారు.గత 25 సంవత్సరాల క్రితం బాలరాజ్ మాస్టర్ శిక్షణ అందించడంతోనే  నేడు అత్యుత్తమ  నైపుణ్యం  కలిగిన మాస్టర్ గా జిల్లా అంతర్జాతీయ టోర్నమెంటులలో ఉత్తమ ప్రతిభ చాటుతూ 1000కి పైగా అవార్డులను సొంతం చేసుకున్న ఘనత అతనిది. అతి తక్కువ ఫీజులతో నైపుణ్యమైన శిక్షణ అందిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి ఆధునిక సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తమను తాము రక్షించుకునేందుకు న్యూ పవర్ కుంఫు శిక్షణ దోహద పడుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా రంగాలలో శిక్షణ అందించేందుకు ప్రోత్సహించాలని మాస్టర్ విజ్ఞప్తి చేశారు.కుంపు శిక్షణతో అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని,శారీరక శక్తి, మానసిక స్థితి, మరియు ఆత్మనిర్భరతను పెంపొందించేందుకు సహాయపడుతుంది.శారీరక ఫిట్‌నెస్.కుంఫు సాధన ద్వారా శక్తి, స్ధైర్యం,సహనము, మరియు సౌష్టవం పెరుగుతాయి.ఆత్మరక్షణ కుంఫు సరిగ్గా నేర్చుకుంటే, ఆపదల నుంచి రక్షించుకోవడం సాధ్యమవుతుంది.క్రమశిక్షణ మరియు సాధన ద్వారా ఆత్మ విశ్వాసంపెరుగుతుంది.మానసిక స్థితి ధ్యానం, క్రమశిక్షణ ద్వారా మానసిక ప్రశాంతత మరియు స్థిరత్వంపొందవచ్చు.కుంఫు సాధనతో క్రమశిక్షణ మరియు సమయపాలన అభివృద్ధి చెందుతాయిని ఈ సందర్భంగా న్యూ పవర్ కుంఫు అకాడమీ నిర్వాహకుడు అహ్మద్ ఖాన్ మాస్టర్ (బ్రూస్ లీ) పేర్కొన్నారు.అతి తక్కువ ఫీజులతో మహిళలకు యువతకు శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, మహిళలు సిగ్గు బిడియం వంటివి పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు.

Read More ఎంపీ వద్దిరాజును సత్కరించిన శ్రీమణికంఠ మహా పాదయాత్ర భక్తులు