కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో మల్లన్న

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో మల్లన్న

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే.

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అధికారులు మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపును ఇప్పటికే పూర్తి చేశారు. ఇవాళ శుక్రవారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

ఇప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 24 మంది సభ్యుల ఎలిమినేషన్ పూర్తి చేశారు అధికారులు. రెండో ప్రధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 220ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 139ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి 118 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. 

Read More కుల గణన సర్వే లో జాగ్రత్తలు పాటించండి  - కూర రమేష్, కార్యదర్శి రంగారెడ్డి  జిల్లా సమాచార హక్కు వికాస సమితి . 

మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,033 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,387, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,431 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకూరికి 29,773 ఓట్లు పోలయ్యాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,646 మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు.