కస్తూరిబా గాంధీ పాఠశాల భవనాన్ని వెంటనే ప్రారంభించాలి

05
 విశ్వంభర ఆమనగల్లు జులై 10 :-  కర్తాల్ మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలను వెంటనే ప్రారంభించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి  ని కోరిన పిఎసిఎస్  చైర్మన్ గంప వెంకటేష్, ఎంఈఓ సర్దార్ నాయక్ కడ్తాల్ మండల కేంద్రంలో  గత ప్రభుత్వ హయాంలో 3.50 కోట్లతో నిర్మించిన కస్తూరిబా గాంధీ పాఠశాల భవనాన్ని వెంటనే ప్రారంభించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆమనగల్లు, కడ్తాల్ మండలాల సింగల్ బిల్డ్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా విజ్ఞప్తి చేశారు. కడ్తాల్  మండల కేంద్రంలో నిర్వహించే కస్తూరిబా గాంధీ పాఠశాల గతంలో అద్దె భవనంలో నిర్వహించేదని, ఆ భవనాన్ని ఇటీవల యజమాని కాళీ చేయించడంతో భవనం లేకపోవడం వలన పాఠశాల విద్యార్థులు కొంతమంది కందుకూరు, ఆమనగల్లు కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో  విద్య నభ్యసిస్తున్నారని  ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. మూడున్నర కోట్లు పెట్టి కడ్తాల్  మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించకపోవడంతో. విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు  వెంకటేష్ గుప్తా తెలిపారు. విద్యార్థినిలను దృష్టిలో పెట్టుకొని  వెంటనే భవనాన్ని ప్రారంభించాలని కోరారు