పార్టీ మార్పుపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

 

ఇప్పుడు బీఆర్ ఎస్ అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. పార్టీ గ్రాప్ క్రమంగా పడిపోతున్న సందర్భంలో మాజీ మంత్రి హరీశ్ రావు పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిపై తాజాగా హరీవ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మాట్లాడారు. 

Read More ఎంపీ వద్దిరాజును సత్కరించిన శ్రీమణికంఠ మహా పాదయాత్ర భక్తులు

పార్టీ మారుతున్నాను అంటూ సోషల్ మీడియాలో కొందరు వ్యూస్ కోసం వార్తలు రాస్తున్నారు. మీ సంస్థలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ మీద మండిపడ్డారు. కొందరేమో కాంగ్రెస్ లో చేరుతున్నట్టు రాస్తున్నారు.. ఇంకొందరేమో బీజేపీలో చేరబోతున్నట్లుగా రాస్తున్నారు. మరికొందరేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ను కాబోతున్నట్టు రాస్తున్నారు. 

ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఇలా రాయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడ్డారు హరీశ్ రావు. ఇకమీదట అయినా తన మీద తప్పుడు ప్రచారం చేయడం మానేయాలని ఆయన హితవు పలికారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేలా వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.