50 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన

50 పడకల 2

విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 10:-  కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు 
 ఆమనగల్ పట్టణంలో నూతనంగా 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, అధికారులు ,ప్రజాప్రతినిధులు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు మండలాలకు కూడలి అయిన ఆమనగల్ పట్టణంలో పది పడకలుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనాన్ని తొలగించి 50 పడకల ఆసుపత్రిగా స్థాయిని పెంచి 17 కోట్ల 50 లక్షల నిధులతో నూతన భవనాన్ని నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో రెండు లక్షల లోపు రైతు రుణాలను ఒకే విడతగా మాఫీ చేసి రైతుల జీవితాలలో వెలుగు నింపడానికి పనిచేస్తామని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వెల్దండ ,ఆమనగల్ , మాడ్గుల మండలాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ నెంబర్ బాలాజీ సింగ్ డిఎంహెచ్ఓ ఎంపిహెచ్ఓ తిరుపతి రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ వైస్ చైర్మన్ దుర్గయ్య కౌన్సిలర్లు హాస్పిటల్ డాక్టర్లు  ప్రత్యేక అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Read More సాయిబాబా మందిరానికి సామాజిక సేవకులు భాస్కర్ గౌడ్ విరాళం