నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయాలి: దోనూరి నర్సిరెడ్డి

14

విశ్వంభర, నారాయణపూర్

Read More రుణమాఫీ కి మద్దతుగా బైక్ ర్యాలీ, సీఎంకు పాలాభిషేకం

నారాయణపురం మండలం అల్లందేవిచెరువు గ్రామపంచాయతీ పరిధిలో సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంతో, గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి హాజరై మాట్లాడుతూ అల్లందేవిచెరువు గ్రామపంచాయతీ ఏర్పడి, ఏడు సంవత్సరాలు అవుతున్న, ఇప్పటికీ  గ్రామంలో రేషన్ షాప్ లేకపోవడం ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
గ్రామానికి సంబంధించిన ప్రజలు రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే ఐదు షాపుల వద్దకు వెళ్ళవలసి వస్తుంది. గ్రామ ప్రజలు సర్వేల్ గ్రామపంచాయతీలో నాలుగు రేషన్ షాపుల వద్దకు, అదేవిధంగా కోతులపురంలో ఒక షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు.
వృద్ధులు, వికలాంగులు సామాన్య ప్రజలు కూడా బియ్యం తీసుకొని వచ్చేటప్పుడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
కావున అల్లందేవిచెరువు గ్రామపంచాయతీ కి, ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని వాగ్దానం చేసింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప, ఏవీ అమలు కావట్లేదు అని అన్నారు.
ఉచితంగా గ్యాస్ ఇచ్చిన గ్యాస్ బండ, డబ్బులు బ్యాంకుల్లో జమ కావట్లేదు, అదేవిధంగా  ఇల్లు, రేషన్ కార్డులు వృద్ధాప్య, వితంతు, పెన్షన్లు నేటికీ ఇంకా అమలు కావడం లేదు.
ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గారెంటీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఉప్పలపేల్లి బాలక్రిష్ణ, అల్లందేవిచెరువు గ్రామ శాఖ కార్యదర్శిలు గంగాదేవి బిక్షపతి, గుండు లింగస్వామి, సీనియర్ నాయకులు బద్ధం జగాల్ రెడ్డి, జెనిగల యాదయ్య, ఉప్పల పెల్లి సైదులు, డివైఎఫ్ఐ నాయకులు గుండు రమేష్,  తదితరులు పాల్గొన్నారు.