గం**జాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దు.        

 

WhatsApp Image 2024-07-04 at 3.45.42 PM

Read More ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి విశ్వంభర :-  జూలై4 గం*జాయి  సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం  భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అవగాహన, మరియు గం*జాయి సేవిస్తూ పట్టుబడిన వారికి భూపాలపల్లి పోలిసు స్టేషన్ ఆవరణలో  ఎస్పీ  కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ జిల్లాలో గం*జాయి నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ నిరహిస్తున్నామని, గం*జాయి వినియోగదారులు, రవాణా దారులపై నిఘా పెట్టామని అన్నారు. గం*జాయి రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు  తప్పవని, గం*జాయి నియంత్రణకు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, జిల్లాకు  సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ లోని గడ్చిరోలి, చంద్రపూర్, బీజాపూర్ నుంచి గం*జాయి రవాణా అయ్యే అవకాశం ఉందని, జిల్లా టాస్క్ఫోర్స్ టీం లు గం*జాయి రవాణా దారులకు చెక్ పెడతాయని, పేర్కొన్నారు.

WhatsApp Image 2024-07-04 at 3.45.26 PM

పదే పదే నేరాలకు పాల్పడుతూ, గం*జాయి రవాణా చేస్తూ పట్టుబడితే P.D యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పి కిరణ్  ఖరే హెచ్చరించారు.  యువత డ్రగ్స్‌, గం*జాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దనే ఉద్దేశంతో ఈ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న గం*జాయి రవాణా,  సేవించేవారు, తప్పనిసరిగా తమ  కుటుంబం కోసం మారాలని, మత్తు పదార్థాలకు బానిసలై ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా నేరాలు చేసే అవకాశం ఉందన్నారు. గం*జాయి, ఇతర మత్తు పదార్థాల బారినపడిన యువకులు మంచి మార్గంలో నడుచుకోవడానికి కౌన్సెలింగ్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చెడు వ్యసనాలను దూరం చేసుకొని మంచి ప్రవర్తనతో మెలగాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరిస్తామన్నా రు. ఎవరైనా గంజాయికి అలవాటుపడిన వారు ఉంటే వారి వివరాలు తెలియజేయాలని, సమాచారం  అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ అన్నారు. గం*జాయి అక్రమరవాణాకు పాల్పడడం, మత్తుపదార్థాల వినియోగించే వారిని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పి ఏ. సంపత్ రావు, భూపాలపల్లి సీఐ డి. నరేష్ కుమార్, చిట్యాల సిఐ డి. మల్లేష్, ఎస్సైలు సుధాకర్, సాంబమూర్తి, రవికుమార్, అశోక్, ప్రసాద్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా