పటేల్ రమేష్ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు 

07

విశ్వంభర చివ్వెoల:-  రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారి సూర్యాపేటకు వస్తున్న సందర్బంగా బుధవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు దారోజు జానకిరాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి రమేష్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధరావత్ రవి,  మునీర్ ఖాన్, కొండ వెంకన్న, రాంమల్లు, శిగ తిర్పయ్య, కోటయ్య చారి, పంతం ఉపేందర్, వెంకటరమణ, పెదపోలు వినోద్, కొప్పు రాజీవ్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Read More అమ్మాయిలను వేధిస్తే కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు