ఘనంగా వడ్డేపల్లి నర్సింగ్ రావు 72వ జయంతి వేడుకలు..
On
విశ్వంభర కూకట్ పల్లి జూలై 10 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూఖనిజా అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ వడ్డేపల్లి నర్సింగ్ రావు 72'వ జయంతి వేడుకలు తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వివేకానంద నగర్ డివిజన్లోని వి.ఎన్.ఆర్ విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో విఎన్ఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.