నేడు సచివాలయంలో మంత్రివర్గ భేటీ...

నేడు సచివాలయంలో మంత్రివర్గ భేటీ...

విశ్వంభర, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దృష్టి సారించింది. నేడు సచివాలయంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తుంది. దాదాపు రెండు నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానంగా ఆరు అంశాలతో అజెండాను రూపొందించింది. మరికొన్ని అంశాలు టేబుల్ అజెండాగా చర్చకు రానున్నాయి.

ఆగస్టుకల్లా రైతులకు రెండు లక్షల రుణమాఫీని కంప్లీట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడంతో ఇప్పటీకే ఒక దఫా రివ్యూ మీటింగ్ జరిగింది. దీనిపై మరింత లోతుగా చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి, కటాఫ్ తేదీ, అర్షులను గుర్తించడం తదితర విధివిధానాలను ఖరారు చేయడానికి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించనున్నది. ఇప్పటికే అర్షుల జాబితాను రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను అలర్ట్ చేసింది.

Read More నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

లోక్ సభ ఎన్నికల పూర్తికాగానే పరిపాలనపై దృష్టి పెట్టనున్నట్లు సీఎం ఇప్పటికే స్పష్టం చేయడంతో వరుసగా రెండు రోజుల నుంచి సచివాలయంలో రివ్యూ మీటింగులు జరుగుతున్నాయి. వాటికి కొనసాగింపుగా మంత్రివర్గ సమావేశానికి కూడా ముహూర్తం ఖరారైంది. ఈ సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.