మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్‌శర్మ అభిమాని.. వీడియో వైరల్

మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్‌శర్మ అభిమాని.. వీడియో వైరల్

మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ వ‌చ్చే సీన్స్ చాలా సార్లు క‌నిపిస్తూనే ఉంటాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆడిన వార్మప్ మ్యాచులో అలాంటి సంఘటనలో జరిగింది.

త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా కలవడానికి అభిమానులు ఉవ్విల్లూరుతుంటారు. మ్యాచ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ వ‌చ్చే సీన్స్ చాలా సార్లు క‌నిపిస్తూనే ఉంటాయి. తాజాగా టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆడిన వార్మప్ మ్యాచులో అలాంటి సంఘటనలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. 

ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ శర్మ వద్దకు నేరుగా వెళ్లి హగ్ చేసుకున్నాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి సదరు అభిమానిని నేలపై పడుకోబెట్టి చితకబాదారు. ఇది గమనించిన రోహిత్ శర్మ.. వద్దని చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. సదరు వ్యక్తిపై తమ కోపాన్ని ప్రదర్శించారు. 

Read More టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..

ఇది గమనించిన మ్యాచ్ నిర్వాహకులు రోహిత్ శర్మ చేస్తున్న రిక్వెస్ట్‌ను పోలీసులు తెలిపారు. అయినా అత‌డిని ఈడ్చుకుంటూ గ్రౌండ్ నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సదరు అభిమానిని రక్షించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

వార్మ‌ప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 182 ర‌న్స్ చేసింది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ హాఫ్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 32 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 53 ర‌న్స్ చేశాడు. హార్దిక్ పాండ్య 40, సూర్య‌కుమార్ యాద‌వ్ 31 ర‌న్స్‌తో రాణించారు.
ల‌క్ష్య ఛేధ‌న‌లో త‌డబ‌డిన బంగ్లాదేశ్ 122 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా