టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..
టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ వచ్చేలా ఉంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి 8 గంటలకు టీమ్ ఇండియా-కెనెడా మ్యాచ్ ఉంది. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో గెలిచిన ఇండియా.. సూపర్-8కు చేరుకుంది. కానీ కెనెడా మాత్రం ఇంకా లీగ్ దశలోనే ఉంది.
కాగా నేడు మ్యాచ్ జరిగే ఫ్లోరిడాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా ఇవాళ రాత్రి మ్యాచ్ జరిగే సమయంలో కూడా వర్షంపడే అవకాశం 50 శాతం ఉందని వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి మ్యాచ్ జరగకపోవచ్చని అంటున్నారు.
ఈ గ్రౌండ్ లో నిన్న అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆగిపోయింది. కాబట్టి ఈ రోజు కూడా మ్యాచ్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈ రోజు మ్యాచ్ ఆగిపోయినా ఎవరికీ పెద్దగా నష్టం ఉండదు. ఇప్పటికే ఇండియా సూపర్-8కి చేరుకుంది కాబట్టి ముందుకు వెళ్తుంది. కానీ కెనడా మాత్రం నిష్క్రమిస్తుంది.