భారత రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్

భారత రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్

విశ్వంభర, ఢిల్లీ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంపూర్ణ విజయం సాధించింది. దీంతో మూడో సారి నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ 3.0 కేబినెట్ లో రాజ్‌నాథ్ సింగ్ వరుసగా రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. జూన్ 9న ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయగా ఈ రోజు(గురువారం) రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పార్లమెంటు నుంచి గెలిచిన ఆయన జూన్ 1, 2019 న మొదటిసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రధాన సమస్య అయిన అగ్నిపథ్ పథకం, సాయుధ బలగాల కార్యాచరణ ఆకస్మిక పరిస్థితులతో పాటు వివిధ మిత్రపక్షాలు, రాజకీయ పార్టీల ఆందోళనలను పరిష్కరించడానికి పెద్ద మార్పులు అవసరం.

Read More మరో మూడు రోజుల్లో అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

"భారత సరిహద్దును రక్షించడం మన ప్రధాన అంశంగా ఉంటుంది, మేము భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడాన్ని కొనసాగిస్తాము. ప్రధాని మోదీ యొక్క దూర దృష్టితో కూడిన నాయకత్వంలో 'మేక్ ఇన్ ఇండియా'ను బలోపేతం చేయడానికి, రక్షణ తయారీ, ఎగుమతులను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి మనల్ని మనం పునరంకితం చేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా