షాకింగ్.. ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రి
- మొన్న కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు
- యూపీలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన మరో మహిళకు షాక్
- అమూల్ ఐస్‌క్రీమ్ బక్స్‌లో జెర్రి
స్ట్రీట్ ఫుడ్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఏం కొందామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బిర్యానీలు, శీతలపానీయాల విషయంలో ఆ జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఈ మధ్య వైరల్ అవుతున్న వీడియోలే ఇందుకు కారణం. ఇటీవల ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన ఓ డాక్టర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. అందులో ఏకంగా మనిషి వేలు కనిపించడంతో ఆ మహిళా డాక్టర్ కంగుతిన్నది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమూల్ ఐస్ క్రీమ్ బాక్స్‌లో జెర్రి ప్రత్యక్షమైంది. దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. యూపీలోని నోయిడాకు చెందిన దీప అనే మహిళ ఆన్‌లైన్‌లో బ్లింకిట్ ద్వారా అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్ ఆర్డర్ పెట్టింది.
అయితే కొద్దిసేపటికి డెలివరీ బాయ్ ఐస్‌క్రీమ్ బాక్స్‌ను డెలివరీ చేశాడు. చల్లచల్లని ఐస్‌క్రీమ్ రుచిచూద్దామని బాక్స్ ఓపెన్ చేశారు. ఊహించని విధంగా అందులో జెర్రి ప్రత్యక్షమవడంతో ఆ మహిళ షాక్ అయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంతమంది తెలంగాణ ప్రభుత్వం అమూల్ ఐస్‌క్రీమ్ విక్రయాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్‌లో జెర్రీ
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2024
ఉత్తరప్రదేశ్ - నోయిడాలో దీప అనే మహిళ తాను ఆన్‌లైన్‌లో బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన అమూల్ ఐస్‌క్రీమ్ బాక్స్ ప్యాక్‌ను తెరిచినప్పుడు జెర్రీ వచ్చిందని తెలిపింది. pic.twitter.com/l1CBiiugqJ