రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న సాయిపల్లవి

రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న సాయిపల్లవి

 

నేచురల్ బ్యూటీ సాయిపల్లవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ జనరేషన్ లో కూడా ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా సినిమాల్లో నటిస్తున్న ఏకైక బ్యూటీ సాయిపల్లవి మాత్రమే. అందుకే ఆమెను యూత్ మొత్తం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక సాయిపల్లవి చేస్తున్న సినిమాలు ఒకప్పటి కంటే తగ్గిపోతున్నాయి.

Read More అభిమాని ఆత్మహత్య.. సోనాలి బింద్రే రియాక్షన్ ఇదే..!

ఇప్పుడు తాజాగా ఆమె తండేలో సినిమాలో నటిస్తోంది. నాగచైతన్య సరసన రెండోసారి నటిస్తోంది. అయితే అటు బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది ఈ భామ. ప్రస్తుతం రామాయణం సినిమా చాలా భారీ బడ్జెట్ తో తెరెక్కుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి సీతగా నటిస్తోంది. 

అయితే ఈ సినిమా కోసం ఆమె రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఆమె బల్క్ డేట్స్ అవసరం ఏర్పడుతాయి. కాబట్టి ఇంత మొత్తంలో ఆమెకు డబ్బులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి లీక్ అయిన ఫొటోలు బాగానే వైరల్ అవుతున్నాయి.