కల్కి సినిమా రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఓకే.. ఎంతంటే..?
On
ఇండియా, అమెరికా అని అసలే బేధాలు లేవు. ఇప్పుడు ప్రపంచం అంతటా 'కల్కి 2898 ఏడీ' ఫీవర్ నెలకొంది. గురువారం ఉదయం మొదటి ఆటకు వెళ్లాలని ప్రభాస్ ఫ్యాన్స్, సామాన్య ప్రజలు అందరూ ఆసక్తిగా వున్నారు. ఓవర్సీస్, అమెరికాతో పాటు తెలంగాణలో కూడా 'కల్కి 2898 ఏడీ' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.
కానీ ఏపీలో ఇంకా కాలేదు. ఇవాళ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా టికెట్స్ రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 75... మల్టీప్లెక్స్‌లలో 125 వరకు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఐదో ఆటకు పచ్చజెండా ఊపింది. రెండు వారాలు... అంటే 14 రోజుల పాటు ఈ వెసులుబాటు ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో రూ. 75 పెంచింది. ఇది 8 రోజుల వరకు మాత్రమే. మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 100 రూపాయలు పెంచింది.