ల్యాప్ ట్యాప్ లను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా.. చాలా డేంజర్..

ల్యాప్ ట్యాప్ లను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా.. చాలా డేంజర్..

 

ఈ రోజుల్లో అందరూ జాబ్ లు చేస్తున్నారు. అది కూడా ల్యాప్ ట్యాప్ లోనే పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది ఆఫీసుల్లోనే కాకుండా ఇంట్లో కూడా ల్యాప్ ట్యాప్ లలో ఏదో ఒక వర్క్ చేస్తుంటారు. అయితే అలా ల్యాప్ ట్యాప్ లో గంటల కొద్దీ వర్క్ చేసే వారికి దిమ్మతిరిగే వార్త చెబుతున్నారు డాక్టర్లు. అలా పనిచేస్తే చాలా ప్రమాదం అంటున్నారు.

Read More పాక నైపుణ్యాలలో చెఫ్ హరీష్ కుమార్ అద్భుతాలు 

ల్యాప్ ట్యాప్ లను ఒడిలో పెట్టుకుంటే.. అవి నిరంతరం వేడికి గురవుతుంటాయి కాబట్టి వృషణాలలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

పురుష పునరుత్పత్తి వ్యవస్థ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం అని అంటున్నారు. సాధారణంగా బాడీలో స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే సాధారణ ఉష్ణోగ్రతలు అవసరం. వృషణాల ఉష్ణోగ్రతను పెంచితే లైంగిక శక్తిని దెబ్బతీస్తుంది. ఇది ‘స్క్రోటల్ హైపర్‌థెర్మియా’ అనే సమస్యకు దారి తీస్తుంది.  ఇవే కాకుండా ల్యాప్‌టాప్‌లు తరచుగా విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి. దాంతో ఇది ఇది స్పెర్మ్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

Related Posts