జులై 4న యూకే ఎన్నికలు.. రిషి సునాక్ కీలక ప్రకటన

జులై 4న యూకే ఎన్నికలు.. రిషి సునాక్ కీలక ప్రకటన

సార్వత్రిక ఎన్నికలకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌  పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు ప్రకటించారు. కేబినేట్‌ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికలకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌  పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు ప్రకటించారు. కేబినేట్‌ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. శుక్రవారం బ్రిటన్ పార్లమెంట్‌ను రద్దు చేయనున్నట్లు రిషి సునాక్ కార్యాలయం పేర్కొంది. 

రాజ్యాంగబద్ధంగా యూకేలో జనవరి 2025లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చాలా రోజులుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రిషి సునాక్ ఆ వాటికి తెరదించారు. పార్లమెంట్‌ను రద్దు చేయమని రిషి అభ్యర్థనను బ్రిటన్‌ రాజు ఆమోదం తెలిపారు. 

Read More బంగ్లాదేశ్‌పై గెలుపుతో చరిత్ర సృష్టించిన భారత్..

ఇదిలా ఉంటే.. 44 ఏళ్ల రిషి సునాక్ ప్రధానమంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ వద్ద వర్షంలో తడుస్తూనే ఆయన ఈ ప్రకటన చేశారు. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో  విజయాలను సాధించామని, దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.