చైతన్యపురి చౌరస్తా లో పెయింటర్స్ ,భవన నిర్మాణ కార్మికుల సంఘం (CITU)  నిరసన 

చైతన్యపురి చౌరస్తా లో పెయింటర్స్ ,భవన నిర్మాణ కార్మికుల సంఘం (CITU)  నిరసన 

మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీసం వేతనం 26000/ వేల నిర్ణయించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

సరూర నగర్, విశ్వంభర :- సరూర నగర్ సర్కిల్ ప్రాంతంలో చైతన్యపురి డివిజన్ లోని చౌరస్తా వద్ద  పెయింటర్స్ ,భవన నిర్మాణ కార్మికుల సంఘం (CITU)   ఆధ్వర్యంలో నిరసనతో పాటు , జూలై 10  కార్మికుల  కోరికల దినోత్సవం పాటించడం జరిగింది.  ఈ నిరసనకు సరూర్ నగర్ సర్కిల్ సిఐటియు కన్వీనర్ మల్లె పాక వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు మొదలయ్యాయి.  జూలై 10న కార్మికుల కోరికల దినోత్సవం జరుగుతుంది అన్నారు.  కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగం సంస్థలను ప్రవేటీకరణ  ఆపాలని నేషనల్ మానిటరేషన్ పైపులను రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు గడువు ముగిసిన వెల్ఫేర్ బోర్డులో కార్డులను రెన్యువల్ చెయ్యాలని కొత్తవారిని వెల్ఫేర్  బోర్డులో పేరు నమోదు చేయాలని మున్సిపల్ కార్మికులకు అందరికీ కనీసం వేతనం 26000/ వేల నిర్ణయించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.  కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని 73 షెడ్యూల పరిశ్రమల జీవోలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల అందరికీ వేతనాలు పెంచాలి . హమాలి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్పర్ బోర్డు ఏర్పాటు చేయాలని హిట్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆశ వర్కర్లు అంగనవాడి మధ్యాహ్నం భోజనం ఐకెపి వివోఏ వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీములల్లో పని చేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టాలు అమలు చేయాలి.  ఆశా వర్కర్లకు పరీక్షలు రద్దు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆశా వర్కర్లు అంగన్వాడీ మధ్యాహ్న భోజనం భవన నిర్మాణ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు వివిధ పనులు చేసుకునే కార్మికులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు

Tags: