తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో శ్రీవారి దర్శనానికి సుమారు 30 నుంచి40 గంటల సమయం పడుతోంది.. క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోందని టీటీడీ పేర్కొంది.
అయితే, సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకుగాను, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. ఈ మార్పును గమనించి భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా కోరింది.