జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా..?

జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా..?

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఇప్పుడు ఏపీలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారు. కూటమికి ఏకంగా 164 సీట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో జగన్ కు గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చి.. మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం చేయడం అందరికీ ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన కల్యాన్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ఈ క్రమంలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 19 నుంచి నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితాల తర్వాత మొదటి సమావేశాలు కాబట్టి.. ఇప్పుడే స్పీకర్ ఎన్నిక, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్నిక ఇవన్నీ ఉంటాయి. అయితే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 సీట్లు గెలవాలి. కానీ ఇప్పుడు జగన్ కు ఉన్నది కేవలం 11 సీట్లు మాత్రమే. 

కాబట్టి ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా.. ఆయనప్రధాన ప్రతిపక్ష నేత అవుతారా లేదా అనేది అనుమానమే అంటున్నారు. అటు టీడీపీ తర్వాత జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. కాబట్టి జనసేనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఏపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. మరి ఎవరికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది అనేది మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాల వరకు ఆగి చూడాల్సిందే.

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts