‘అది క్షమించరాని నేరం..’ రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై ష‌ర్మిల స్పందన ఇదే..!

‘అది క్షమించరాని నేరం..’ రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై ష‌ర్మిల స్పందన ఇదే..!

  • ప్రజా ధనం ఖర్చుపెట్టి ఉంటే క్షమించరాని నేరమని వ్యాఖ్య
  • సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ 

ఏపీ రాజకీయాల్లో రుషికొండ అంశం సంచలనంగా మారుతోంది. వందల కోట్ల ప్రజాధనంతో మాజీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయాన్ని కట్టించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అటువైపు ఎవరినీ అనుమతించలేదు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిషికొండ ప్యాలెస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటపెట్టింది. 

ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్‌ షర్మిల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండప్యాలెస్‌ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకు నిర్మించారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా ఈ నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు. ఒకవేళ తప్పని రుజువైతే మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం సుమారు రూ.8లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని... వాటిని విచ్చలవిడిగా ఖర్చు చేరిందని షర్మిల దుయ్యబట్టారు.

Related Posts