పవన్ బాబాయ్ వల్లే చరణ్‌ కు నాకు గొడవలు.. సుస్మిత సంచలన వ్యాఖ్యలు

పవన్ బాబాయ్ వల్లే చరణ్‌ కు నాకు గొడవలు.. సుస్మిత సంచలన వ్యాఖ్యలుమెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కు మంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పవన్ కల్యాణ్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా సంలచనం రేపుతున్నాయి. 

Read More అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

పవన్ బాబాయ్ డిప్యూటీ సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది. పవన్ బాబాయ్ ఎప్పుడూ మాతో చాలా సరదాగా ఉండేవారు. ఆయన నాకు రామ్చరణ్‌ కు ఎప్పుడూ గొడవలు సృష్టించేవారు. అయితే పవన్ కల్యాణ్‌ బాబాయ్ వల్లే నాకు తమ్ముడికి ఎప్పుడూ గొడవలు వచ్చేవి. మేమిద్దరం గొడవలు పడుతుంటే బాబాయ్ సినిమా చూసినట్టు చూసేవారు. 

అది చాలా సరదాగా ఉండేది. అది గుర్తుకు వస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. కానీ బాబాయ్ లాంటి వ్యక్తి మా కుటుంబంలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాజకీయాల్లో సక్సెస్ కావడం నిజంగా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకంగా ఉంది అంటూ ఆమె తెలిపారు.