400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం.. తాడిపత్రిలో కలకలం
- సినిమా స్టైల్‌లో లారీలో స్పెషల్ బాక్సులు.. గోవా మద్యం తరలిస్తుండగా పట్టివేత
Goa Liquor Seized: తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి తాడిపత్రి వైపు లారీలో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించి భారీగా మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారం తాడిపత్రిలో ఒక్కసారిగా కలకలం రేపింది. సాధారణంగా కనిపించేలా లారీని సిద్ధం చేసి, పట్టుబడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. భారీ మొత్తంలో గోవా మద్యం తాడిపత్రికి తరలించడం వెనుక ఎవరున్నారు? ఈ రవాణా వెనుక అసలు నెట్‌వర్క్ ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది.
మద్యం తరలించేందుకు లారీలో సినిమా స్టైల్‌లో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల కంటపడకుండా మద్యం బాటిళ్లను దాచేందుకు ఈ ప్రత్యేక బాక్సులను ఉపయోగించినట్లు సమాచారం. అంతేకాకుండా లారీకి ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన వేర్వేరు నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్రంలో ఒక నంబర్ ప్లేట్, మరో రాష్ట్రంలో మరో నంబర్ ప్లేట్ ఉపయోగిస్తూ తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లు చూస్తే మద్యం అక్రమ రవాణా వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరు? మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? తాడిపత్రిలో ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకొస్తున్నారు? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానం రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ అక్రమ మద్యం రవాణా వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రిలో లిక్కర్ సిండికేట్ వ్యవహారంపై ఇప్పటికే ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా గోవా మద్యం పట్టుబడటం మరింత చర్చకు దారితీసింది. ఈ వ్యవహారానికి జేసీ కుటుంబానికి లేదా జేసీ వర్గానికి ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు జేసీకి ఈ అక్రమ మద్యం రవాణాతో సంబంధం ఉందని నిర్ధారించే అధికారిక ఆధారం బయటకు రాలేదు. పోలీసులు పట్టుకున్న లారీ, మద్యం బాటిళ్ల వెనుక ఉన్న వ్యక్తులు, తాడిపత్రిలో సరఫరా చేయాల్సిన వారికి సంబంధించిన వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. గోవా నుంచి ఇంత పెద్ద మొత్తంలో మద్యం తాడిపత్రికి తరలించడం వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను పోలీసులు బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.