జూన్ 12న స్కూళ్లకు సెలవు?

జూన్ 12న స్కూళ్లకు సెలవు?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినేతలతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పదవుల సర్దుబాటుపై చర్చించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినేతలతో చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పదవుల సర్దుబాటుపై చర్చించారు. అనంతరం స్వరాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్షించారు. 

తొలుత ఈనెల చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, అదేరోజు  ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే రెండు తేదీల్లో పండితులు మంచి ముహూర్తాలు చూశారు. 

అందుకే ప్రమాణ స్వీకారంలో మార్పు చేసుకోవడానికి ఏ ఇబ్బందీ కలగలేదు.  ఇదిలా ఉండగా, స్కూళ్లకు సంబంధించి 2023-24 విద్యాసంవత్సరానికి గానూ అకాడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 12 నుంచి స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని తెలిపింది. మొత్తం 229 రోజులు పని చేస్తాయని తెలిపింది. అలాగే 88 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయని పేర్కొంది. 

అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు రాష్ట్రంలోని స్కూళ్లకు సెలవు ప్రకటించాలని పాఠశాల ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ను మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కోరారు. సీఎంగా చంద్రబాబు 12న ప్రమాణ స్వీకారం చేస్తున్నందున కార్యక్రమంలో టీచర్లు పాల్గొనేలా ఈ వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. స్కూళ్ల పున:ప్రారంభ తేదీని 13వ తేదీ నాటికి వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts