ఢిల్లీలో మా మద్దతు వాళ్లకే.. తేల్చి చెప్పేసిన జగన్..

ఢిల్లీలో మా మద్దతు వాళ్లకే.. తేల్చి చెప్పేసిన జగన్..

 

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇప్పటికే సమీక్ష నిర్వహించిన జగన్.. భవిష్యత్ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఎంపీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని ప్రకటనలు, సూచనలు చేశారు.

ఢిల్లీలో ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని.. ప్రజాహితమే ధ్యేయంగా.. ప్రజలకే మద్దతు తెలపాలని సూచించారు. అంతే కాకుండా గెలుపు, ఓటములను పక్కన పెట్టి పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడాలని తెలిపారు. ప్రస్తుతం మనకు పార్లమెంట్ లో 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారని..  మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారని తెలిపారు. 

కాబట్టి మన పార్టీ కూడా బలమైనదే అని ఆయన వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు రావొద్దని.. బలంగా పోరాడితే మళ్లీ మనదే అధికారం అని ఆయన వివరించారు. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయని.. కాబట్టి ఈ ఐదేండ్లు ప్రజల్లో ఉండి పోరాడితే కచ్చితంగా పాత రోజులు వస్తయాని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఎంపీలకు కొన్ని సూచనలు చేశారు. ఇది వరకు లాగానే రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని, లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి ఉంటారని తెలిపారు జగన్.

Related Posts