మాజీ ఎమ్మెల్యే బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత

కాకినాడ జిల్లా సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లిలో తుదిశ్వాస విడిచారు.

కాకినాడ జిల్లా సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన స్వగ్రామం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లిలో తుదిశ్వాస విడిచారు. బుల్లబ్బాయి రెడ్డి రెండు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 

కాగా కాంగ్రెస్ హయాంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న జనసేన శ్రేణులు సంతాపం ప్రకటించారు. జిల్లా రాజకీయాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బుల్లబ్బాయిరెడ్డి తొలుత వ్యాపార రంగంలో రాణించారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాసంస్థల ద్వారా ఆయన గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఏపీఎస్సార్టీసీకి రీజనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్‌గా ఆయన పనిచేశారు. అనిశెట్టికి భార్య రత్నం, ఒక కొడుకు ఉన్నారు.

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

Related Posts