ఏపీలో ఆ చానల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !

ఏపీలో ఆ చానల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !

ఏపీలో కొన్ని టీవీ చానల్ల ప్రసారాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ టీవీ ఛానల్ లో ప్రసారాలు మళ్లీ యధావిధిగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించినట్లు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కాగా 

 ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల అనగా జూన్ 6 నుంచి నిలిచిపోయిన టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ ల ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌ లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది. 

Read More మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసిన ఏపీ ప్రభుత్వం

ఆ ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో వార్తా ఛానళ్ల ప్రసారాలను ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిలిపివేతను తాజాగా ఢిల్లీ హైకోర్ట్ ఖండించింది. తద్వారా న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి మూలస్తంభాలైన వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక సూత్రాలను బలోపేతం చేస్తుందని ఫెడరేషన్ సభ్యులు ప్రకటించారు. కాగా జూన్ 6 నుంచి టీవీ9 తెలుగు, ఎన్టీవీ, సాక్షి టీవీ, సహా పలు న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు ఏపీలో బ్లాక్‌ఔట్ కావడం పత్రికా స్వేచ్ఛపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. దాంతో ఏపీ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంలో మార్పు కారణంగా ఈ వార్తా ఛానళ్లను బ్లాక్ ఔట్ చేయాలని కేబుల్ ఆపరేటర్లందరిపై ఒత్తిడి తీసుకురావడం తగదని అన్నారు.

 ఇక్కడ సెట్ టాప్ బాక్స్ ద్వారా దాదాపు 65 లక్షల మంది వార్తలను వీక్షిస్తారని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వార్త ఛానెల్స్ ని దాదాపుగా 62 లక్షల బాక్స్‌ల నుంచి తప్పించి, ప్రేక్షకులకు సమాచార హక్కును నిరాకరించే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని అన్నారు. కాగా ఛానెల్స్‌ను డిస్‌కనెక్ట్ చేయడం చట్టవిరుద్ధమని, పంపిణీ సంస్థలతో కుదుర్చుకున్న ఇంటర్ కనెక్షన్ ఒప్పందానికి విరుద్ధంగా ఉందని ఢిల్లీ హైకోర్టులో టీవీ9 పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏపీ ప్రజలు తమకు ఆసక్తి ఉన్న వార్త చానెళ్లను వీక్షించే హక్కును కొనసాగుతుందని నిర్ధారిస్తూ అనధికారికంగా నిలిపివేయబడ్డ వార్తా చానెళ్లను పునరుద్దరించాలని ఈ ఉత్తర్వుల ద్వారా ఆదేశించింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా