లోకేష్ చెప్పిన చోటనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం..

లోకేష్ చెప్పిన చోటనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం..

 

మంగళగిరి సమీపంలోనే
మద్దతు పెరుగడం కోసమే

విశ్వంభర, మంగళగిరిః చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గరపడుతోంది. అయితే ఈ సారి టీడీపీ ప్రభుత్వం కాకుండా ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువుదీరబోతోంది. ఎన్నికలకు ముందే చంద్రబాబు సీఎం అని ప్రకటించేశారు. అయితే తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి మధ్య ఇంకా మంత్రుల కేటాయింపులు జరగలేదు. 

కానీ జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉండాలని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ చెప్పిన చోటనే చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవం జరగబోతోందని తెలుస్తోంది. అది కూడా లోకేష్ కు బాగా నచ్చిన చోటనే.

Read More ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల

ఇప్పుడు మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఓ విశాలమైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్య నేతలతో కలిసి స్థల పరిశీలన చేయబోతున్నారంట. ప్రధాని మోడీ వస్తారు కాబట్టి.. మంగళగిరికి రప్పించాలని లోకేష్ డిసైడ్ అయ్యారంట. అది తనకు బలం చేకూర్చుతుందని భావించి ఇక్కడే ప్రమాణస్వీకారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు లోకేష్.