నీట్ ప్రక్రియ పై సుప్రీం సంచలన నిర్ణయం...
On
విశ్వంభర, ఢిల్లీ : 2024 నీట్ యూజీ పరీక్షల వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గురువారం నీట్ పేపర్ లీక్ పై విచారణ జరిపిన కోర్టు ... ఎట్టిపరిస్థితుల్లో నీట్ 2024 ప్రక్రియను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. ఈ కేసులో అనేక సార్లు విచారణ జరిపిన కోర్టు పేపర్ లీక్ లో 001 శాతం నిర్లక్ష్యం ఉన్న ఎన్టీఏ పై చర్యలు తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. అలాగే...ఈ కేసుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులో ఉన్న విచారణలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. కాగా 2024 పరీక్ష 1563 మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు పొందారు. 67 మంది విద్యార్థుల 720 మార్కులు సాధించడంతో నిరసనలు, ఫిర్యాదులు పెరిగాయి.