VIRAL: రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన
హైదరాబాద్‌లో చిన్న వర్షానికే రహాదారులన్నీ జలమయం అవుతున్నాయి. కొన్నిచోట్ల నడి రోడ్డుపై నీటి కుంటలు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లో చిన్న వర్షానికే రహాదారులన్నీ జలమయం అవుతున్నాయి. కొన్నిచోట్ల నడి రోడ్డుపై నీటి కుంటలు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, గత రెండు రోజులుగా కురిసిన చిన్న వర్షానికే నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైంది. అడుగడుగున గుంతలుండటంతో ఆ ప్రాంతమంతా బురదమయమైంది. దీంతో అక్కడి కాలనీ వాసులంతా నడి రోడ్డుపై నిరసనకు దిగారు.
అయితే, అందులో ఒక మహిళ మరొక్క అడుగు ముందుకేసి రోడ్డు దుస్థితి బాగాలేదనీ.. ఆనంద్ నగర్‌లో రోడ్లు పాడైపోయిన ఎవరూ పట్టించుకోవడంలేదని.. రోడ్డు మీద ఉన్న నీటి కుంటలోకి దిగి నిరసన తెలిపింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కాగా, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, నాగోల్‌లోని ఆనంద్ నగర్‌లో రోడ్ల దుస్థితి బాగాలేదని.. నడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు https://t.co/nUsAlRL2ZR pic.twitter.com/2uBSmQDY95
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024