హైదరాబాద్ తో సమానంతో వరంగల్ అభివృద్ధిః రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ తో సమానంతో వరంగల్ అభివృద్ధిః రేవంత్ రెడ్డి..

 

వరంగల్ సిటీని కూడా హైదరాబాద్ తో సమానంతో అభివృద్ధి చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. హెలికాప్టర్‌లో గీసుకొండ మండలం శాయంపేటకు చేరుకున్న రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  

Read More అమ్మాయిలను వేధిస్తే కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు

అనంతరం టెక్స్ టైల్ పార్క్ ను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో ప్లాంటేషన్‌తో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభిస్తామన్నారు. ఆ తర్వాత వరంగల్ సిటీ అభివృద్ధిపై హనుమకొండ కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

వరంగల్ ను కూడా హైదరాబాద్ తో సమానంగా డెవలప్ చేసి చూపిస్తామన్నారు. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ ను మార్చాల్సి ఉందని.. వరంగల్ సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2050ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ అభివృద్ధి బాధ్యత నాది అంటూ తెలిపారు. వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు త్వరలోనే ప్లాన్ రెడీ చేయాలని ఆదేశించారు అధికారులను.