నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం...చెంచు విద్యార్థి అనుమానాస్పద మృతి

విశ్వంభర, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిగుర్ల రాముడు అనే చెంచు విద్యార్థి అడవిలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం నల్లమల్ల లోతట్టు ప్రాంతంలోని రాంపూర్ పెంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…చిగుర్ల రాముడు అనే విద్యార్థి అచ్చంపేట మండలంలో ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.

ఈ క్రమంలో అదే పాఠశాలలో పనిచేస్తున్న ఓ పంతులమ్మ విద్యా బుద్ధులు చెప్పాల్సింది పోయి అతడితో సన్నిహితంగా ఉంటూ ప్రేమ పాటలు చెప్పింది. ఆ విద్యార్థిని వశపరుచుకుని రాముడితో సన్నిహితంగా మెలిగింది. అయితే, ఆ పంతులమ్మకు భర్త ఉన్నప్పటికీ అభంశుభం తెలియని విద్యార్థితో ఎక్కడికైనా వెళ్లిపోదామని అనుకుంది. ఈ క్రమంలో వారిద్దరూ కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నారనే సమాచారం టీచర్ భర్తకు తెలిసింది.

Read More పురిటి నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా సర్జరీ చేసి కాన్పు చేశారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.

దీంతో పంతులమ్మ రాముడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారించింది. దీంతో రాముడు అడవిలోకి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిగుర్ల రాముడు అనే విద్యార్థి పంతులమ్మ మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా..? వారిద్దరి మధ్య ఇంకేమైనా జరిగి ఉంటుందా.. లేక టీచర్‌కు దూరం అవుతున్నాననే మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా