మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు…

మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పులు…

విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. మెట్రో రైల్లు టైమింగ్ మార్పులు ఉంటే బాగుంటుందని ప్రయాణికుల కోరిక మేరకు మెట్రో యాజమాన్యం స్పందించి సమయం అనుకూలంగా ఉండేందుకు మార్పులు చేర్పులు చేశారు.  ట్రయల్ లో భాగంగా చివరి రైలు రన్నింగ్‌ వేళలను వారానికి ఒకరోజు పొడిగించారు. ఈ మారిన సమయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు వివరించారు. 

ఈ మేరకు ఫేస్ బుక్, ఎక్స్ హ్యాండిల్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. చివరి మెట్రో రైలు శుక్రవారం రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read More మూసీ సుందరీకరణ మాత్రమే కాదు - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

అయితే.. శుక్ర, సోమ వారాలు మాత్రమే ఎందుకంటే శని, ఆదివారాలు చాలా మంది ఉద్యోగులకు సెలవుదినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక సోమవారం ఉదయం సమయంలో మార్పుకు గల కారణం ఉదయం నుంచే ఉద్యోగులు ఉండటంతో మార్పులు చేస్తున్నట్లు మోట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని సూచించారు.