ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేము : మాజీ సీఎం కేసీఆర్

ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేము : మాజీ సీఎం కేసీఆర్


విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ప్రొఫెసర్  జయశంకర్ కరడుగట్టిన తెలంగాణ వాది.. ఈ సమయంలో ఆయనను స్మరించుకోకుండా ఉండలేమని అన్నారు. అప్పట్లో చాలా మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలక వద్దని అప్పటి స్వీకర్ అసెంబ్లీలో అన్నారని చెప్పారు.

ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారన్నారు. "ముల్కీ నిబంధనలు సమంజసమే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పుతో ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో 70 మందికి పైగా కాల్పుల్లో చనిపోయారు. సుప్రీం తీర్పును కాలరాస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసింది.

Read More రామయ్యను దర్శించుకున్న కోదండరాముడు 

ఎప్పటికైనా ఓ నాయకుడు రాకపోతాడా అని జయశంకర్ భావించారు. ఉమ్మడి ఏపీలో ముగ్గురు తెలంగాణ వాళ్లే సీఎంలు అయ్యారు. తెలంగాణ వ్యక్తి సీఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది. 2001 కాదు...1999లోనే ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుంది అంటూ అలనాటి జ్ఞాపకలను గుర్తు చేశారు.