కిడ్నాప్ కు గురైన 11 నెలల బాబు… కేసు నమోదు

కిడ్నాప్ కు గురైన 11 నెలల బాబు… కేసు నమోదు

విశ్వంభర, వెబ్ డెస్క్ : 11 నెలల బాబు కిడ్నాప్ అయిన ఘటన సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చోటు చేసుకుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కు చెందిన వానరాశి జంపన్న, దుర్గా దంపతులు గత వారం క్రితం వలస వచ్చి సత్తుపల్లి గుడిపాగు రోడ్డులో గుడారం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. గ్యాస్ స్టవ్లు, మిక్సీలు రిపేర్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి తల్లిదండ్రులు బాబుతో పాటు గుడారంలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తల్లి లేచి చూడగా బాబు సాయి దేవాన్ష్ కనపడకపోవడం తో అర్ధరాత్రి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చి పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ సాయి దేవాన్స్​ ఆచూకీ లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తలు తమ బాబుని కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు మంగళవారం ఉదయం సత్తుపల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా