సోషల్ మీడియా పుకార్లు, అమాయక ప్రజ లను టార్గెట్ చేసిన వ్యాపారులు 

WhatsApp Image 2024-07-10 at 12.49.03 PM

10 జూలై 2024 విశ్వంభర మెట్పల్లి

Read More రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం

 గతంలో మనుమలకు స్తోమతకు తగ్గట్టు. బంగారు లేదా వెండి బ్రాస్లెట్ అమ్మమ్మలు మనుమలకు చేయించాలని సోషల్ మీడియాలో పుకార్లు లేపిన వెంటనే వారికి వచ్చు పింఛన్లు డబ్బులతో .లేదా దాచుకున్న డబ్బుల నుండి స్తోమతకు తగ్గట్టు బ్రాస్లెట్లు చేయించి బాధ్యతను తీర్చుకున్నారు .ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలు పండుగలు ఉండవు అనే నేపథ్యంలో వ్యాపారులు కొత్త ట్రెండు మొదలుపెట్టారు వదిన మరదలు వరుస అయిన వారికి గాజులు వేయాలని లేదా ఇంటికి అరిష్టం అని పుకార్లు లేవనెత్తారు దానికి తోడు అల్లుండ్లకు కండువా మరియు చక్కెర పోయాలని నెట్టెంటా పుకార్లు చెక్కర్లు కొట్టాయి 
చూసిందే తడువు అమాయక ప్రజలు బ్యాంగిల్ స్టోర్. మరియు కిరాణా దుకాణాలు .బట్టలకోట్లు.ఎలాంటి శుభకార్యాలు లేకున్నా పుకార్లను గుడ్డిగా నమ్మిన అమాయక ప్రజలు అప్పు సప్పు చేసి వ్యాపారస్తుల గళ్ళ డబ్బాలను నింపుతున్నారు. అసలు ఈ పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో తెలియదు కానీ మధ్యతరగతి ప్రజలకు అదనపు భారం ఒకరిని చూసి ఇంకొకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి ఇలాంటి మూఢనమ్మకపు వదంతులు నమ్మని కొందరు. అమాయక ప్రజలను మోసం చేయడానికి తమ తమ వ్యాపారాలు జోరుగా సాగేందుకు కొంతమంది వ్యాపారులు చేస్తున్న పుకార్లేనని అంటున్నారు. ఏది ఏమైనా ఏ పండుగ లేకున్నా బంధువుల రాకపోకలతో గ్రామాల్లో ఇల్లన్నీ సందడిగా మారుతున్నాయి ఆషాడ మాసం కదా ....అంతే మరి.....