కేజ్రీవాల్ కు మళ్లీ షాక్.. బెయిల్ పై స్టే విధించిన కోర్టు
కేజ్రీవాల్ కు మరోసారి షాక్ తగిలింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత నిన్న గురువారం రాత్రి బెయిల్ వచ్చిందని సంతోషించే లోపే.. బెయిల్ మీద స్టే విధించింది హైకోర్టు. గురువారం రాత్రి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడంతో దాన్ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై హైకోర్టు విచారణ జరిపింది.
బెయిల్ మీద స్టే విధించింది. హైకోర్టులో జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుడేజాతో కూడిన ధర్మాసనం ఈ స్టే విధించింది. కాగా ఈ బెంచ్ కంటే ముందు ఈడీ బెయిల్ మీద మీద స్టే విధించాలంటూ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. కానీ తర్వాత బెంచ్ మాత్రం దానిపై స్టే విధించింది.
పూర్తి స్థాయిలో కేసును విచారించేందుకు అనుకూలమైన సమయాన్ని తమకు ఇవ్వలేదని.. తమ వాదన వినిపించేందుకు సమయం ఇవ్వలేదని హైకోర్టులో ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదించారు. మనీలాండరింగ్ యాక్ట్‌లోని సెక్షన్ 45ని ప్రస్తావించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ బెయిల్‌పై స్టే విధించాలని కోరారు. ప్రస్తుతం దానిపై ఇంకా విచారణ జరిగే అవకాశం ఉంది.