దేశాన్ని కుదిపేస్తున్న అజ్మీర్ లైంగిక దాడి కేసు.. సంచలనాలు వెలుగులోకి..!

దేశాన్ని కుదిపేస్తున్న అజ్మీర్ లైంగిక దాడి కేసు.. సంచలనాలు వెలుగులోకి..!

 

అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న గ్యాంగ్
ఫొటోలు మార్పింగ్ చేసి డబ్బులు వసూలు
అనంతరం సామూహిక అత్యాచారాలు
గతేడాది నుంచి సాగుతున్న తతంగం

 

అజ్మీర్ లైంగిక దాడి కేసు ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి.. ఆ తర్వాత వారి ఫొటోలను మార్పింగ్ చేయడం.. డబ్బులు డిమాండ్ చేసి అమ్మాయిలను సామూహికంగా లైంగిక దాడి చేయడం.. ఆ తతంగాన్ని వీడియో రికార్డ్ చేసి పదే పదే డబ్బలు వసూలు చేయడం, పలుమార్ల లైంగిక దాడలు చేయడం.. ఇది అజ్మీర్ కథ. ఇప్పుడు ఈ కేసు బయటకు రావడంతో అందులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి.

Read More హైదరాబాదులో ఎన్ఐఏ తనిఖీల కలకలం

ఈ దారుణం చాలా రోజులుగా సాగుతున్నా వారికి భయపడి అమ్మాయిలు బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఓ యువతి ఫిర్యాదుతో బయటకు వచ్చింది. నిందితులు కోచింగ్ సెంటర్లకు వెళ్లే అమ్మాయిలనే ట్రాప్ చేస్తుంటారు. రీసెంట్ గా ఓ యువతి కోచింగ్ సెంటర్ కు వెళ్లగా అక్కడ ఆమెకు మరో అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన యువతి.. ఇర్ఫాన్ అనే పేరుతో ఉన్న ఇన్ స్ట్రాగ్రామ్ ఐడీని ఫ్రెండ్ రిక్వెస్ట్ ద్వారా యాక్సెప్ట్ చేయాలంటూ తెలిపింది. ఆ అమ్మాయి అలాగే చేసింది. యువతి ఇన్ స్టా నుంచి ఫొటోలు డౌన్ లోడ్ చేసుకున్న సదరు యువకుడు వాటిని మార్పింగ్ చేశాడు. 

ఆమెను డబ్బులు పంపించాలని.. లేదంటే సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించాడు. ఆమె డీల్ కు ఒప్పుకుని రూ.5 లక్షలు ఇవ్వడానికి ఓకే చెప్పింది. తన ఇంట్లోనే డబ్బులను దొంగతనం చేసింది. నిందితుడు చెప్పిన చోటకు డబ్బులతో వెళ్లగా.. సదరు యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని మొత్తం వీడియో తీశారు. ఆ వీడియోను యువతికి పంపించి మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేకపోయిన యువతి.. విషయం తన ఇంట్లో వారికి చెప్పింది. కుటుంబీకులు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం బయటకు వచ్చింది.

కేసు నమోదు చేసిన అజ్మీర్ పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 2023 నుండి ఈ తతంగమంతా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

Related Posts