రాష్ట్రపతి భవన్‌లోకి నో ఎంట్రీ
త్వరలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి లేదు.
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు అనుమతి లేదు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ ఒక ప్రకటన చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే ప్రక్రియ రాష్ట్రపతి భవన్‌లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర నూతన మంత్రిమండలి ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్రపతిభవన్‌లోకి సందర్శకులను అనుమతించడంలేదు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రధాని మోడీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని రాష్ట్రపతిని బీజేపీ సారథ్యంలోనే ఎన్డీయే కూటమి కోరుతుంది. అనంతరం కొత్త క్యాబినెట్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.