BREAKING: బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు..!

BREAKING: బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు..!

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్బర్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ మోఖ్బర్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరణిస్తే, ఉపాధ్యక్షుడు ఆ పదవిలో కొనసాగుతారు. ఆదివారం రాత్రి ఇరాన్-అజర్‌బైజానీ సరిహద్దులో క్విజ్ ఖలాసి డ్యామ్ ప్రారంభోత్సవం అనంతరం ఇరాన్‌లోని తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. 

వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ సెప్టెంబర్ 1, 1955న జన్మించారు. ఇరాన్ రాజకీయ, ఆర్థిక రంగాల గురించి లోతుగా తెలుసు. అతను 2021లో ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇరాన్ చరిత్రలో ఉపాధ్యక్షుడి నియామకం జరగడం అదే తొలిసారి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జప్తు చేసిన ఆస్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సెటాడ్‌కు అధిపతిగా పనిచేశారు. 

Read More పోలీసులపై వైద్యురాలి తల్లితండ్రులు సంచలన ఆరోపణలు

వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన ఇప్పుడు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఇప్పుడు ఆరోపణల మధ్య ఇరాన్ అధ్యక్షుడిగా ఆయన కొనసాగగలుగుతారా? అనేది చూడాల్సిందే. ఇదిలా ఉండగా తాజాగా ఇబ్రహీం రైసీ మృత దేహాన్ని ఆర్మీ సిబ్బంది గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ మరణానికి తాము కారణమంటూ వస్తున్న వదంతులను ఇజ్రాయెల్ ఖండించింది.