బాంబే ఐఐటీలో రామాయణాన్ని అపహాస్యం చేసేలా నాటక ప్రదర్శన...యాజమాన్యం సీరియస్
విశ్వంభర, ముంబాయి: బాంబే ఐఐటీలో వివాదస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన రామాయణ స్కిట్ అపహాస్యం చేసేలా ఉందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ. 1.20లక్షల చొప్పున జరిమానా విధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్ జరిగింది. ఇందులో కొందరు విద్యార్ధులు రాహోవన్ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. అయితే అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో పాటు అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ...అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను వాడుకొని స్కిట్ వేశారు.
అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, స్కిట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్ర రామాయణాన్ని కించపర్చారని, సంప్రదాయాలను మంట గలిపారని ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో యాజమాన్యం సీరియస్ యాక్షన్ తీసుకుని విద్యార్థులకు జరిమానా విధించింది.