కెనడాలో భారత సంతతి యువకుడు దారుణ హత్య

కెనడాలో భారత సంతతి యువకుడు దారుణ హత్య

విశ్వంభర, పంజాబ్‌ : భారత సంతతికి చెందిన యువరాజ్ గోయల్(28) అనే యువకుడు కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 7న గోయల్ సర్రేలోని తన ఇంట్లో ఉండగానే నిందితులు విచక్షణ రహితంగా అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే గోయల్ ఇంటికి వెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. అయితే హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిని సర్రేకు చెందిన మన్విర్ బస్రామ్, సాహిబ్ బస్రా సర్రే, హర్కీరత్ జుట్టి, అంటారియోకు చెందిన కెయిలాన్ ఫ్రాంకోయిస్‌లుగా గుర్తించారు.


కాగా, పంజాబ్‌లోని లుథియానాకు చెందిన గోయల్ 2019లో కెనడాకు వెళ్లారు. ఇటీవలే కెనడాలో శాశ్వత నివాస హోదా పొందారు. అక్కడ ఆయన ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. గోయల్ కాల్చి చంపబడటానికి కొద్దిసేపటి ముందు తన తల్లితో ఫోన్ కాల్‌ మాట్లాడినట్టు తెలుస్తోంది. యువరాజ్‌కు ఎటువంటి నేర చరిత్ర లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కెనడాకు వెళ్లడానికి కన్నా ముందు యువరాజ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (ఆనర్స్) పూర్తి చేశాడు.

Read More పార్లమెంట్ లో పరిమళించిన చేనేత వస్త్రాలు 

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా