నాని ‘సరిపోదా శనివారం’ ఎలివేషన్ సాంగ్ అదిరిపోయిందిగా..!!

నాని ‘సరిపోదా శనివారం’ ఎలివేషన్ సాంగ్ అదిరిపోయిందిగా..!!

  • ఫస్ట్ సింగిల్ ‘గరమ్ గరమ్’ లిరికల్ సాంగ్ రిలీజ్ 
  • ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా

‘హాయ్ నాన్న’ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో నాని ఎలివేషన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘గరమ్ గరమ్   యముడ‌యో.. సహనాల శివుడాయో.. నరం నరం బిగువయో..’ అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

యాక్షన్ డ్రామాగా  తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ బాణీలకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. ఈ హీరో ఎలివేషన్ సాంగ్‌ను విశాల్ దడ్లానీ పాడారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై విలక్షణమైన కథతో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ పాట మొత్తంగా హీరో పాత్రను వర్ణిస్తూ సాగుతుంది. ఈ ఫస్ట్ సింగిల్ ద్వారానే తన మూవీ థీమ్ ఎలాంటిదో డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. 

Read More సినిమా నడుస్తుండగానే వర్షం.. తడిసి ముద్దయిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!

ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. నానితో పాటు ఎస్‌ జే సూర్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు ప్రచారచిత్రాల ద్వారా తెలుస్తోంది.  చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా