రేపు పోలింగ్.. తమ్ముడిపై నాగబాబు సెన్సేషనల్ పోస్ట్

రేపు పోలింగ్.. తమ్ముడిపై నాగబాబు సెన్సేషనల్ పోస్ట్

విశ్వంభర, వెబ్ డెస్క్ : మెగా బ్రదర్స్ బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరి నిర్ణయాలకు ఒకరు కట్టుబడి ఉండటమే కాకుండా తగిన ప్రోత్సాహం కూడా ఇస్తుంటారు. గతంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి డబ్బులు లేకుంటే చిరంజీవి సహాయం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఓ రేంజ్ లో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో టికెట్​ త్యాగం చేసినా కూడా ఏమాత్రం నిరాశకు లోనవకుండా మరితం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను నాగబాబు తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు. అందులో భాగంగానే తెల్లవారితే ఎన్నికలు అనగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై ఓ ఆసక్తికరమైన పోస్టును వదిలారు.

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టును చూపిస్తాడు. అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని... నీతో నడవని వాళ్ల కోసం ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కిన రైతు కంటిని తడపకుండా పంటనే తడపుతుందని... అప్పట్నుంచి అడగడం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతను అర్థం చేసుకోవడం మొదలెట్టాను... సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది.. కూటమి రాబోతుంది... సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది...విజయీభవ...!  అని నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్​ చేశారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా