పవన్ కల్యాణ్ సినిమాలు మానేస్తున్నారా..?
పవన్ కల్యాన్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకం కాబోతున్నారు. ఎందుకంటే ఆయన కూటమిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. దాంతో పాటు ఇప్పుడు ఆయన పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచింది. దాంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోతోంది. అయితే ఆయన కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా పెద్ద పదవిలో ఉంటారని అంతా అంటున్నారు.
పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఖాయం అని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆయన అభిమానులకు మాత్రం పెద్ద షాక్ తప్పదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ఆయన సినిమాలు చేయడం అస్సలు కుదరదు. కేబినెట్ మంత్రి పదవి వచ్చినా సరే సినిమాలు చేసే పరిస్థితి ఉండదు.
పవన్ కల్యాన్ కూడా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇంకో సినిమా ఒప్పుకోలేదు. వీటి తర్వాత ఆయన సినిమాలకు దూరం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుంటే అప్పుడు అడపా దడపా సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. చూడాలి మరి పవన్ ఏం చేస్తారో.