తేజ సజ్జ సినిమాలో విలన్‌గా మంచు మనోజ్.. గ్లింప్స్ విడుదల..!
మనోజ్ బర్త్‌డే సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు.
ఇవాళ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ జన్మదినం. ఈ సందర్భంగా వారికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే మనోజ్ బర్త్‌డే సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
‘హను-మాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. మనోజ్ జన్మదిన సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. బ్లాక్ స్వార్డ్ అనే పాత్రలో మనోజ్ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ గ్లింప్స్‌ను చూస్తే మనోజ్ అత్యంత ప్రమాదకరమైన విలన్‌గా కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. మిరాయ్ అంటే భవిష్యత్తు అని అర్థం. టైటిల్‌తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. దీంతో మంచు మనోజ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The most talented actor turns into the Most Powerful Force in this world🔥
— BA Raju's Team (@baraju_SuperHit) May 20, 2024
Presenting everyone’s favourite Rocking 🌟@HeroManoj1 in a Brand New Avatar in #MIRAI 💥#TheBlackSword GLIMPSE OUT NOW❤️🔥
- https://t.co/pX0dniHK0M#HBDManojManchu ✨
Superhero @tejasajja123… pic.twitter.com/nO0hpGWTA8